TG DSC 2024 Online Exam dates- Telangana DSC Subject wise SGT, SA posts CBT exams Schedule

Telangana DSC 2024 Online Exam dates- Subject wise SGT, SA  CBT dates for DSC exams Schedule. Department of School Education has released the subject-wise dates for DSC exams from July 18 to August 5.

The Education Department has released the schedule for the DSC examination to be held for filling 11,062 teacher posts in the state.

It has been announced that the exams will be conducted online for the first time from July 18 to August 5. To this extent, School Education Commissioner Devasena has released the schedule. 2,79,956 people have applied for 11,062 teacher posts across the state.

However, the education department, which previously announced that the exams would be held only from July 17 to 31, has recently announced that the exams will be held from July 18 to August 5. It has been announced that the examinations will be conducted in two phases under CBRT system every day

జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు, సబ్జెక్టుల వారిగా తేదీలను విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ

జూలై 18 నుంచి డీఎస్సీ పరీక్షలు-  ఆగస్టు 5 వరకు..

 తొలిసారి ఆన్‌లైన్‌లో పరీక్షలు.  షెడ్యూల్‌ విడుదల చేసిన విద్యాశాఖ

TG DSC 2024 సబ్జెక్ట్ వారీగా CBT పరీక్ష షెడ్యూల్
 రాష్ట్రంలో 11,062 టీచర్‌ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న డీఎస్సీ పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ షెడ్యూల్‌ విడుదల చేసింది

 జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు తొలిసారిగా ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు స్కూల్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ దేవసేన షెడ్యూల్‌ను విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 11,062 టీచర్‌ పోస్టుల కోసం 2,79,956 మంది దరఖాస్తు చేసుకున్నారు

 అయితే, గతంలో జూలై 17 నుంచి 31 వరకు మాత్రమే పరీక్షలుంటాయని ప్రకటించిన విద్యాశాఖ.. తాజాగా జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించింది. ప్రతిరోజూ సీబీఆర్టీ విధానంలో రెండు విడతల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది

 తొలిరోజు జూలై 18న స్కూల్‌ అసిస్టెంట్‌ (సోషల్, ఫిజికల్‌ సైన్స్‌) తెలుగు మీడియం పోస్టులకు ఫస్ట్‌ షిఫ్ట్‌లో, సెకండ్‌ షిఫ్ట్‌లో ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్లకు పరీక్ష నిర్వహించనున్నారు. చివరి రోజు ఆగస్టు 5న ఫస్ట్‌ షిఫ్ట్‌లో స్కూల్‌ అసిస్టెంట్‌ (ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌) పోస్టులకు, సెకండ్‌ షిఫ్ట్‌లో లాంగ్వేజీ పండిట్‌ (హిందీ) పోస్టులకు పరీక్ష జరగనుంది.

TG DSC 2024 పరీక్షల తేదీలు :

  • జులై 18వ తేదీన మొదటి షిఫ్ట్‌ స్కూల్‌ అసిస్టెంట్‌ ఫిజికల్‌ సైన్స్‌ పరీక్ష.. సెకండ్‌ షిఫ్ట్‌లో ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పరీక్ష నిర్వహిస్తారు.
  • జులై 19వ తేదీ నుంచి 22వ తేదీ వరకు వివిధ మీడియంల ఎస్జీటీ పరీక్షలు జరుగుతాయి.
  • జులై 20వ తేదీన ఎస్‌జీటీ, సెకండరీ గ్రేడ్ ఫిజికల్‌, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ పరీక్షలుంటాయి.
  • జులై 22వ తేదీన స్కూల్‌ అసిస్టెంట్‌ మ్యాథ్స్‌ పరీక్ష ఉంటుంది.
  • జులై 24వ తేదీన స్కూల్‌ అసిస్టెంట్‌ బయలాజికల్‌ సైన్స్‌ ఎగ్జామ్‌ ఉంటుంది.
  • జులై 26వ తేదీన తెలుగు భాషా పండిట్‌, సెకండరీ గ్రేడ్‌టీచర్‌ పరీక్ష ఉంటుంది.
  • జులై 30వ తేదీన స్కూల్‌ అసిస్టెంట్‌ సోషల్‌ స్టడీస్‌ పరీక్ష ఉంటుంది.

TG DSC 2024 Subject wise CBT Exam Schedule

TG DSC 2024 Exam Schedule PDF download