General Provident Fund (GPF) Rules and Regulations 2024

General Provident Fund-: Rules and Regulations 2024

General Provident Fund-: నియమ నిబంధనలు

  • 1).పర్మనెంట్ బేసిస్ మీద రెగ్యులర్ స్కేలు నియామకమయిన నా్గెజిటెడ్/గెజిటెడ్ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు నియామకమయిన తేది నుండి  జి.పి.ఎఫ్ లో  చేరనలసి ఉంటుంది, అఖరి  స్థాయి ఉద్యోగులు గృహనిర్మణం కోసం స్థలం కొనుగోలుకై లేదా గృహనిర్మజణానికి అవసరమైన డబ్బు, గృహరి పేరింగులకై కనీసం 5సం॥ల సర్వీసు పూర్తి చేసిన వారు ఇంకా 10సం॥ల సర్వీసు కలిగిన వారు కూడ జి.పి.యఫ్. లో చేరుటకు అర్హులు.
  • 2) తేది 1-9-04 నాటి నుండి ఉద్యోగములో చేరినారు.  జి.పి. యఫ్. స్కీం లో  చేరుటకు అర్హులు కారు (G0.Ms.No.654 తేది 22-9-204) జి.ఫి.యఫ్.అకౌంటులను చూసే బాధ్యత అకౌంటెంట్ జనరల్ అం.ప్ర, గారికి అప్పగించవైనది.
  • 3) పంచాయతీ రాజ్ సంస్థలలో పనిచేయు ఉద్యోగుల , ఉపాధ్యాయులు GPF అకౌంటులు మొత్తము జిల్లా పరిషత్తు  CEO గారు  నిర్వహిస్తారు.
  • 4)  ఈ GPF నుండి  అప్పులు, పార్ట్ఫైనల్స్ ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు మండల విద్యాధికారి ఉన్నత పాఠశాల ప్ర.ఉ.లకు ఉపవిద్యాధికారి మంజూరు చేయవచ్చు. G0.Ms.No.40, dt.7-5-2002 .
  • 5) ప్రతి ఉపాధ్యాయుడు/ఉద్యోగి తన వేతనము నుండి ప్రతినల కనీసము 6%నకు తగ్గకుండ స్రీమియం చెల్లించాలి. జి. పి. ఎఫ్ ప్రీమియంను సంవత్సరమునకు ఒకసారి తగ్గించవచ్చును. లేదా సంవత్సరమునకు రెండుసార్లు. పెంచవచ్చును.  G0.Ms.No.21, dt.24-1-81.  ఈ ప్రీమియం రిటైర్మెంటుకు నాలుగు నెలల ముందు నిలుపుదల చేయవచ్చు.  ఇలా చెల్లించిన జి.పి.యఫ్.నిల్వలపై ఆయాకాలములలో  వడ్డీ   రేట్లు లభించును.
 
 నామినీ : జి.పి.యఫ్.లో సభ్యులుగా చేరిన వెంటనే సర్వీసులో ఉండగా అనుకోని సంఘటనల ద్వార తనకు ఏమైన జరిగినచో అట్టి డబ్బును చెల్లించుటకై నామినీ ఫారము దాఖలు చేయాలి. ఈ నామినీ పేరును సర్వీసు పుస్తకములో ఎంట్రీ చేయించడము చాలా ముఖ్యము.
 

 GPF నుండి అడ్వాన్సు: 

 GPF లో నిలువయున్న మొత్తం నుండి ఈ క్రింది నింబంధనలకు లోబడి త్కాలికముగా రుణము పొందడానికి అవకాశము కలదు.

(ఏ ) ఈ రుణం ఉద్యోగి 3 నెలల జీతమునకు సమానమైన లేదా జమచేయబడిన డబ్బు నుండి 50% పై రెండింటి లో ఏది తక్కువయితే ఆ మొత్తాన్ని రుణంగా మంజూరు చేయవచ్చు.

(బి ) ఒక ఉద్యోగి ఒక  ఆర్ధిక  సంవత్సరములో రెండుసార్లుGPF రుణం పొందవచ్చు

(సి ) తనకు లేదా తనపై ఆధారపడిన వారి సుదీర్ఘకాల చికత్స అవసరాల కొరకు, తనకు లేదా తనపై ఆధారపడిన వారి ఉన్నత విద్యకొరకు , విదేశాలకు వెళ్లవలసివస్తే దాని ఖర్చులకోసం/, స్వదేశంలో ఉన్నత విద్యకొరకు.

(డి ) తనకు లేదా తమ పిల్లల నిశ్చితార్థం, వివాహములకు, జన్మదినవేడుకలకు, తనకుటుంబీకల అంత్యక్రియలకు

(ఈ ) ఉత్సవం నిర్వహణలో భాగంగా తీర్థయాత్రలకు వెళ్లవలసివస్తే దాని ఖర్చుల కొరకు

(ఎఫ్ ) ఉద్యోగ విధినిర్వహణ సందర్భంగా తలెత్తిన ఆరోపణలను ఎదుర్కొనడానికి కావలసిన ఖర్చుల నిమిత్తమై.

(జి ) గృహనిర్మాణంలో భాగంగా స్థల సేకరణకు, గృహనిర్మణమునకై, గృహ రిపేరులకై అయ్యే ఖర్చుల కొరకై

(యచ్ ) ఉద్యోగ విరమణ తేదికి ఆరునెలల ముందు వ్యవసాయ భూములు మరియు వ్యాపారస్థలం కొనుగోలుకై

(ఐ ) ఒక మోటారు కారు కొనుగోలు కోసం GPF రుణం పొందవచ్చు

          నిర్ణీత ప్రొఫార్మ యందు వినతిపత్రము రుణము పొందుటకు గల కారణములకు ఆధారములు జతపరుస్తూ జిపియఫ్ రుణము మంజూరు చేయు అధికారికి సమర్పించాలి. తీసుకున్న రుణము ఆరువాయిదాలకు తగ్గకుండ 24 వాయిదాలకు మించకుండ తిరిగి చెల్లించాలి. (G.O.Ms.397 Dt.14-11-2008 ).

పార్ట్ ఫైనల్ విత్డ్రాయల్స్:
20 సంవత్సరాల సర్వీసును పూర్తిచేసుకున్న ఉద్యోగులు లేదా 10 సంవత్సరముల లోపల రి టైర్ అవుతున్న ఉద్యోగులు తమ ప్రావిడెంట్  ఫండ్లో నిలువయున్న డబ్బు నుండి  పార్ట్ ఫైనల్  విత్డ్రాయల్ చేసుకోవచ్చు. ఈ పార్ట్ ఫైనల్  విత్ డ్రాయల్  మొత్తాలను తిరిగి చెల్లించవలసిన అవసరం లేదు. ఈ క్రింది కారణాల ఖర్చులకై పార్ట్ ఫైనల్  మంజూరి చేయవచ్చు.
(ఏ )కుమారుడు కుమార్తెల ఉన్నత విద్యాఖ్యాసం మరియు వివాహాల కొరకు.

(బి )ఆరోగ్యకారణాల వల్ల ఎదురయ్యే ఆరోగ్య, వైద్య, ప్రత్యేక ఆహార, ప్రయాణ ఖర్చులకై

(సి ) ఒకే కారణం కోసం రెండుసార్లు పార్ట్ ఫైనల్  చేసుకోవడానికి అవకాశం లేదు.

(డి ) రిటైర్  అవుతున్న ఉద్యోగి తన ఆఖరు నాలుగు నెలల ఉద్యోగ కాల సమయములో పార్ట్ ఫైనల్ విత్ డ్రాయల్ కు అవకాశం లేదు.

(ఈ )  పార్ట్ ఫైనల్ విత్ డ్రాయల్  అత్యవసర పరిస్థితుల బట్టి 6 నెలల జీతము లేదా 10 నెలల జీతమునకు సరిపడు డబ్బు  లేదా విలువలోనున్న డబ్బు నుండి 75% వరకు  మంజూరి చేయవచ్చును.

(యఫ్ ) G. O. Ms. No447  PR  Dept. Dt.28-11-2013 ద్వారా పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు జి.పి.ఎఫ్ నిల్వలపై అప్పులు మంజూరు చేయు అధికారం హెచ్.ఎమ్/ఎం.ఇ.ఒ.లకు కలదు

(జి ) ప్రధానోపాధ్యాయులకు, బోధనేతర సిబ్బందికి గతంలో వలెనే జిల్లా పరిషత్ ఉప ముఖ్య కార్యనిర్వహణ అధికారే అప్పులు మంజూరు చేస్తారు.  నిబంధనల ప్రకారం అప్పులు మంజూరు చేసి మంజూరు ఉత్తర్వులను, ఫారం-40ఎ తో జతచేసి జిల్లాపరిషత్ కు పంపుకుంటే వారు మంజూరైన సొమ్మును ఆన్లైన్లో బ్యాంకు ఖాతకు జమచేస్తారు .

గమనిక : తేది 1-9-04 తర్వాత ఉద్యోగములో చేరువారికి జిపిఎఫ్ వర్తించదు. అనగా జిపిఎఫ్ స్కీము కొత్తవారికి ఉండదు.   (GO.Ms.654 తేది 22-9-2004).     DSC 2002   వారికి   జిపిఎఫ్ సౌకర్యము కలుగజేయబడినది.

C&DSE Procs No.48857/D2-3/10, Dt.20-12-2010.

Download GENERAL PROVIDENT FUND (CENTRAL SERVICES) RULES, 1960 

TS ZPGPF Annual Account Slips Download TS 33 Districts GPF Slips

 AP ZPGPF Annual Account Slips 26 Districts GPF SLIPS   

One Comment