Covid Emergency Loan Assistance Banks offering Low Interest, 3 months unpaid/ Less repayment Loans
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
అప్పు కావాలా.. తీసుకోండి!
వడ్డీ తక్కువ… 3 నెలలు చెల్లించక్కరలేదు
ఉద్యోగులు, డ్వాక్రా, పింఛనుదారులు, పరిశ్రమలకు అవకాశం
కరోనా నేపథ్యంలో ముందుకొచ్చిన బ్యాంకులు
కోవిడ్ ఎమర్జెన్సీ లోన్ అసిస్టెన్స్ :
కరోనావైరస్‌తో కష్టకాలంలో ఉన్న ఉద్యోగులు, డ్వాక్రా, పింఛనుదారులు, పరిశ్రమలను ఆదుకునేందుకు ప్రభుత్వరంగ బ్యాంకులు తక్కువ వడ్డీ తో మూడు నెలల పాటు తిరిగి చెల్లించనవసరం లేకుండా లోన్లు ఇచ్చేందుకు ముందుకొచ్చాయి।
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఉద్యోగులు, ఖాతాదారులకు ప్రభుత్వ రంగ బ్యాంకుల ‘కోవిడ్ అత్యవసర రుణ సాయం’
కరోనాతో కష్టకాలంలో ఉన్న ఉద్యోగులు, డ్వాక్రా, పింఛనుదారులు, పరిశ్రమలను ఆదుకునేందుకు ప్రభుత్వరంగ బ్యాంకులు ముందుకొచ్చాయి. మూడు నెలలపాటు తిరిగి చెల్లించనవసరం లేకుండా.. తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తున్నాయి. కేంద్రం, రిజర్వుబ్యాంకు ఆదేశాల మేరకు దాదాపు అన్ని ప్రభుత్వరంగ బ్యాంకులు కోవిడ్ అత్యవసర రుణ సాయం(సీఈఎల్‌సీ) పేరుతో ఈ రుణాలను అందిస్తున్నాయి. నెలనెలా జీతం తీసుకునే ఉద్యోగులు, స్వయం సహాయక బృందాల సభ్యులు, పింఛనుదారులు, పరిశ్రమలకు ఈ రుణాలు అందిస్తున్నాయి. ఈ రుణలపై వడ్డీ రేటు కూడా తక్కువే. సాధారణంగా గతంలో వ్యక్తిగత రుణాలకు 12-14శాతం వడ్డీ వసూలు చేసేవారు.
ఇప్పుడు 8 శా తం వడ్డీకే రుణాలు ఇస్తున్నారు. ఇది అత్యవసర రుణం కాబట్టి తక్కువ వడ్డీరేటుకే ఇస్తున్నామని బ్యాంకులు చెప్తున్నాయి. ఎస్‌బీఐ, యూనియన్ బ్యాంకు, ఇండియన్ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంకు, సిండికేట్ బ్యాంకులు ఈ అత్యవసర రుణాలు అందిస్తున్నా యి. అయితే పాత ఖాతాదారులకే ఈ రుణాలు అందిస్తున్నాయి. ఉద్యోగులకు వారి జీతాన్ని బట్టి రూ.5లక్షల వరకు
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
చిన్న పరిశ్రమలకు 10 శాతం అదనం
ఎంఎ్‌సఎంఈలతోపాటు పెద్ద పరిశ్రమలన్నీ దాదా పు నెల రోజుల నుంచీ లాక్‌డౌన్‌లోనే ఉన్నాయి. దీంతో ఉత్పత్తి, అమ్మకాలు ఆగిపోయాయి. అయితే అద్దె, కార్మికుల వేతనాలు, విద్యుత్ బిల్లులు లాంటి స్థిర ఖర్చులను చెల్లించక తప్పని పరిస్థితి. దీంతో ఈ పరిశ్రమలకు రుణ పరిమితిని పెంచారు. కొత్తగా ఎలాం టి సెక్యూరిటీ అవసరం లేకుండా గతంలో ఉన్న పరిమితికి 10శాతం పెంచి ఇస్తున్నాయి. గతంలో ఒక పరిశ్రమ రూ.10 లక్షలు వర్కింగ్ క్యాపిటల్ రుణం తీసుకుంటే…దానిపై 10శాతం అంటే ఒక లక్ష రూపాయలను ఇప్పుడు రుణంగా అందిస్తున్నాయి. ఎంఎ్‌సఎంఈ, పెద్ద పరిశ్రమలకు కూడా స్థిర ఖర్చుల చెల్లింపునకు ఈ రుణం ఉపయోగపడుతోంది.
మూడు నెలలు చెల్లించనక్కర్లేదు
కోవిడ్ అత్యవసర రుణాలకు రిజర్వుబ్యాంకు ప్రకటించిన మూడు నెలల మారటోరియం కూడా వర్తిస్తుంది. అంటే రుణాల చెల్లింపు ఇబ్బంది అనుకుంటే మూడు నెలలపాటు చెల్లించాల్సిన అవసరం లేదు. రుణాల చెల్లింపును తేలిక చేసేందుకు రిజర్వుబ్యాంకు ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ క్రెడిట్ మేనేజర్ దుర్గాప్రసాద్ తెలిపారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
Check Jan Dhan Yojana Account Balance -PM Gareeb Kalyan Yojana Banks Transferred Rs.500 to Women